![]() |
![]() |

సూపర్ సింగర్ షో కొంత కాలం నుంచి ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా వెళ్తోంది అనుకుంటే ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి. రీసెంట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. శ్రీముఖిని చూడలేక మెడ అటు ఇటు తిప్పేస్తున్న అనంత శ్రీరామ్ ని రాహుల్ ఒకసారి కిందకి చూడు అనేసరికి పొట్టి గౌను వేసుకున్న శ్రీముఖి కాళ్ళు చూసి మనోభావాలు దెబ్బ తినలేదు కానీ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాయి అంటూ రొమాంటిక్ డైలాగ్ వేసాడు అనంత శ్రీరామ్.
ఇక ఈ రాబోయే వారం షో కాన్సెప్ట్ సింగ్ అండ్ డాన్స్ అని చెప్పారు. సూపర్ సింగర్స్ పాడుతూ ఉంటే బుల్లితెర నటీనటులు డాన్స్ చేస్తూ ఉంటారు. బుల్లితెర నుంచి అమర్ దీప్, తేజస్విని గౌడ, హమీద, భానుశ్రీ, అంబటి అర్జున్, ఐశ్వర్య పిస్సే వచ్చారు. "అక్కడ జడ్జెస్ లో ఇద్దరు హ్యాండ్ సంగా అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు తెలుసా" అని శ్రీముఖి హమీదాని అడిగేసరికి "చంద్రబోస్" అంటూ అనంత శ్రీరామ్ పేరును మార్చి చెప్పేసరికి కామెడీగా సీట్ లోంచి లేచి వెళ్లిపోయారు శ్రీరామ్. మధ్యలో అనంత శ్రీరామ్ భానుశ్రీ డాన్స్ ని ఇమిటేట్ చేస్తూ స్టేజి మీద పిచ్చి డాన్సులు వేశారు. ఫైనల్ గా రాహుల్ కి మంగ్లీకి మధ్య గొడవ మొదలయ్యింది.
మంగ్లీ టీం నుంచి వచ్చిన లేడీ కంటెస్టెంట్ కి రాహుల్ సిప్లింగంజ్ 8 మార్కులే ఇచ్చాడు. దాంతో సింగర్ మంగ్లీ బాధపడింది. "నాకు అది చాలా డిజప్పాయింట్ గా అనిపించింది" అని మంగ్లీ అంటే.. ‘డిజప్పాయింట్ అవడం నీ ఇష్టంలే కానీ.. నేను బొచ్చెడు సార్లు 10 మార్క్స్ ఇచ్చాను’ అని అన్నాడు రాహుల్. దాంతో మంగ్లీ.. ‘నువ్వు మళ్ళా గడిగడికీ..10 మార్క్స్ బొచ్చెడు సార్లు ఇచ్చినా అని అనకు.. ఈ పెర్ఫామెన్స్ గురించి మాట్లాడు ’ అని సీరియస్ అయ్యింది మంగ్లీ. ఇక రాహుల్.. ‘చూడు మంగ్లీ.. మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నామనుకో సెన్స్‌బుల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి.. మైక్ దొరికింది కదా అని అరవొద్దు.. నేను ఏం చెప్తున్నానో ముందు విను ఫస్ట్’ అని అన్నాడు. దాంతో సింగర్ మంగ్లీ.. ‘ఓ మైగాడ్... ఓ మై గాడ్’ అంటూ సీరియస్ అయ్యింది.
![]() |
![]() |